తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ను శనివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, పలు కేసులపై ఆరా తీశారు. స్టేషన్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బంది సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తొర్రూరు సీఐ జగదీశ్, ఎస్సైలు ఉపేందర్, రామ్ జీ, ట్రైనీ ఎస్సై కృష్ణ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.