సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. బేకరీ మాటున గుట్కాను కిరాణా షాపులకు చేరవేస్తున్నారు. ఈ నెల 14న శంకర్ విలాస్ సెంటర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా, రెండు మినీ ఆటోల్లో గుట్కా సంచులు పట్టుబడ్డాయి. నిందితులు ఇచ్చిన సమాచారంతో మార్కెట్ రోడ్డులోని మంజు కిరాణం అండ్ బేకరీ షాపులో దాడులు చేశారు.
ALSO READ : గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి
మొత్తం రూ.11 లక్షల గుట్కా ప్యాకెట్లు పట్టుబడడంతో యజమాని మాయదేవర శివసత్తి, ఆటో డ్రైవర్ యర్రంశెట్టి నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ ఆఫీస్‌లో కేసు వివరాలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. గుట్కా రవాణాను గుర్తించిన సీఐ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్‌ను అభినందించారు. సమావేశంలో ఏఎస్సీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సిబ్బంది పాల్గొన్నారు .