గేమ్స్​తో ఫిజికల్ ఫిట్​నెస్ : ఎస్పీ సురేశ్

ఆసిఫాబాద్, వెలుగు : గేమ్స్ ఆడటం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో పోలీసు సాయుధ బలగాలకు నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్​ను ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆటలను అలవర్చుకోవా లని సూచించారు.

పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢ త్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. టోర్నీ సింగిల్స్ విభాగంలో మొత్తం 20 మంది పాల్గొనగా, కె.వెంకటేశ్ విజేతగా, ఆర్ఎస్ఐ సందీప్ రన్నరప్​గా నిలిచారు. డబుల్స్ విభాగంలో 8 జట్లు పాల్గొనగా కె.వెంకటేశ్, ఎస్.వెంకటేశ్ విజేతలుగా, ఆర్ఎస్ఐ కిరణ్, బి.శశి రన్నరప్​గా నిలిచారు.