- ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్, వెలుగు: తొమ్మిది నెలలు ట్రైనింగ్పూర్తి చేసుకొని డ్యూటీలో చేరుతున్న కానిస్టేబుళ్లు నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జిల్లా నుంచి 149 మంది కానిస్టేబుళ్లు వివిధ శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చారని ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మెదక్‌జిల్లా పోలీస్ఆఫీసులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు ఉద్యోగం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, శారీకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలన్నారు.
ట్రైనింగ్ అనంతరం రోజూ వ్యాయామం చేసి ఫిట్ గా ఉండాలన్నారు. పోలీసు శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు అని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని సూచించారు. అంకిత భావంతో సేవలుందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు.
నేరాల నియంత్రణ , కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులకు మంచి గు-ర్తింపు ఉన్నదని, చట్టబద్ధమైన పౌరులుగా మీ సేవలను చూసి సమాజం గౌరవించేలా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు కృషి చేయాలని, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగ నాయక్, ఏవో మణి, ఎస్పీ ఆఫీసు ఇన్చార్జి వలియానాయక్, శైలేందర్, అల్తాఫ్, నరేశ్, మహిపాల్, మినిస్టీరియల్ సిబ్బంది
పాల్గొన్నారు.