భరోసా సెంటర్​ నుంచి వాంగ్మూలం ఇవ్వొచ్చు : ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

భరోసా సెంటర్​ నుంచి వాంగ్మూలం ఇవ్వొచ్చు : ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: పోక్సో బాధితులు కోర్టుకు రాకుండా  పట్టణంలోని భరోసా సెంటర్​ నుంచి వాంగ్మూలం ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి తెలిపారు. మంగళవారం మెదక్ భరోసా కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్​హాల్​ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్​ హాల్​ ద్వారా బాధితులు కోర్టుకు రాకుండా తమ వాంగ్మూలాన్ని  కోర్టుకి నివేదించవచ్చన్నారు. భరోసా సెంటర్​లోని సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి అవసరమైన సూచనలు చేశారు. 

అనంతరం పట్టణంలోని సఖి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కో-ఆర్డినేటర్ రేణుక సఖి కేంద్రంలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ  మహేందర్, ఇన్​స్పెక్టర్లు, మధుసూదన్, సందీప్​రెడ్డి, భరోసా సెంటర్ కో- ఆర్డినేటర్ సౌమ్య, లీగల్ అడ్వయిజర్​ శ్వేత, సఖి సెంటర్ లీగల్ అడ్వయిజర్​ నిర్మల ఉన్నారు. అనంతరం పట్టణంలోని పోలీస్​ పెరేడ్​ గ్రౌండ్​లో నిర్మిస్తున్న సెల్యూట్ బేస్, స్లాబ్​ పనులను ప్రారంభించారు.