![ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం : ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/sp-uday-kumar-reddy-launched-the-cctv-cameras_qQ7hIC3vBl.jpg)
కొల్చారం, పాపన్నపేట, వెలుగు : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. కొల్చారం పీఎస్పరిధిలోని పోతంశెట్టిపల్లి క్రాస్ రోడ్డు నుంచి ఏడుపాయల వెళ్లే రూట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఏడుపాయల జాతర బందోబస్త్ ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ ప్రదేశాలను, స్నాన ఘాట్లను, ఆలయ పరిసరాలను పరిశీలించారు. బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ఆటోలు, టూ వీలర్లకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. మంజీరా నది వెంట లోతు ప్రదేశాలను సూచించే విధంగా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ గౌస్ పాల్గొన్నారు.