బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి : ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

  • ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​టౌన్​, వెలుగు: బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్​ పట్టణంలోని బ్యాంకుల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  బ్యాంక్ ముందు, లోపల తప్పకుండా సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్​చేయడానికి, చొరబాట్లను గుర్తించడానికి ఆధునిక అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏటీఎమ్​ల నుంచి డబ్బులు తీసుకెళ్లే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్​గా ఉండాలన్నారు.

 బ్యాంక్ చుట్టు పక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పీఎస్ కు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు మెదక్ జిల్లా సాయుధ దళాల మోబిలైజేషన్  శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.