భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ట్రాఫిక్నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ వినీత్ పోలీస్ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్లో గల కాన్ఫరెన్స్హాల్లో ట్రాఫిక్పోలీస్ ఆఫీసర్లు, సిబ్బందితో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ర్యాశ్డ్రైవింగ్, మద్యం తాగి వెహికల్స్నడిపేవారి లైసెన్స్రద్దు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, సీఐ నాగరాజు, ట్రాఫిక్ఎస్సై నరేశ్, భద్రాచలం ట్రాఫిక్ఎస్సై శ్రీనివాస్పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి...
చండ్రుగొండ: ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్సై ఎం.రవి డ్రైవర్లను ఆదేశించారు. శుక్రవారం చండ్రుగొండలోని మార్కెట్ గోదాముల్లో నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో సరఫరా చేసిన150 మంది డ్రైవర్లకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, జడ్పీ కోప్షన్ సభ్యుడు రసూల్, సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, రైతుబంధు సమితి మండల కోఆర్డనేటర్ లింగయ్య, ఆటో అడ్డాల అధ్యక్షులు జహీర్, పిచ్చయ్య, వెంకటేశ్వరావు పాల్గొన్నారు..