అజ్ఞాత మావోయిస్టు కుటుంబానికి ఎస్పీ పరామర్శ

భూపాలపల్లి రూరల్, వెలుగు : భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరామర్శించారు. గురువారం పంబాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ అజ్ఞాత మావోయిస్టు మచ్చ సోమయ్య ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్, నిత్యావసర వస్తువులు అందజేశారు.  

ఈ సంద‌ర్భంగా ఎస్పీమాట్లాడుతూ..  మచ్చ సోమయ్య అజ్ఞాతం వీడి జ‌నంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు.  జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, సీఐ నరేశ్ కుమార్, ఎస్‌ఐలు సుధాకర్, రమేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.