వనపర్తి, వెలుగు: ఈ నెల 11న వనపర్తికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానుండగా, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి పరిశీలించారు. బుధవారం కేడీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్‌ను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కేంద్ర హోంమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు.
అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణం, ఎస్బీ ఇన్స్పెక్టర్ ముని, టౌన్ ఎస్ఐలు జయన్న, రామరాజుఉన్నారు. అనంతరం చిట్యాల మార్కెట్ యార్డ్ గోదామ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాకు వచ్చే కేంద్ర బలగాలు, కర్నాటక పోలీసుల వసతి ఏర్పాట్లను పరిశీలించి, ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.