కోస్గి, వెలుగు: ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేలా చూడాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మద్దూర్, కోస్గి పోలీస్ స్టేషన్లను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read ; మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ
ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ ఆఫీసర్లు కష్టపడి పని చేయాలని, జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంపల్లి చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. డీఎస్పీ కె సత్యనారాయణ, సీఐ జనార్ధన్, ఎస్ఐలు సురేశ్, శ్రీనివాసులు ఉన్నారు.