నారాయణపేట, వెలుగు: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేశ్ గౌతమ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన శోభయాత్రలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
మరి కొంత మందిని విచారిస్తున్నామని తెలిపారు. వారికి సంబంధించిన వివరాలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు నమ్మవద్దని, అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు పెట్టిన వారిపై, అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.