స్పా సెంటర్​ ముసుగులో వ్యభిచారం

  • నలుగురు యువతులు రెస్క్యూ
  • పోలీసుల అదుపులో ఒక విటుడు 
  • పరారీలో స్పాసెంటర్ ఓనర్, ఆర్గనైజర్

చందానగర్, వెలుగు: స్పా సెంటర్​ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. చందానగర్​లో న్యూ డ్రీమ్​పేరుతో కొన్నిరోజులుగా స్పా సెంటర్ నడుస్తోంది. ఇందులో యువతులతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ హ్యూమన్​ ట్రాఫికింగ్​పోలీసులు మంగళవారం సాయంత్రం రైడ్ చేశారు. నలుగురు యువతులను రెస్య్కూ చేసి, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని చందానగర్ పోలీసులకు అప్పగించారు. స్పా సెంటర్ ఓనర్ రామకృష్ణ, ఆర్గనైజర్ కరుణశ్రీ పరారీలో ఉండగా,  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.