ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ భూమిపై నుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్‌ను 2050 నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం అంతరిక్షానికి వ్యోమగాములను, ఉపగ్రహాలను పంపేందుకు ఉపయోగిస్తున్న వాహక నౌకల అవసరం లేకుండా స్పేస్ ఎలివేటర్లతో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్లెంబర్ల ద్వారా అంతరిక్షానికి పంపించవచ్చు. సోలార్, మైక్రోవేవ్ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్ ఎలివేటర్లు పనిచేస్తాయి.
ప్రయోజనాలు
- ఒబాయాషి సంస్థ ప్రకారం రాకెట్లను పంపించేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 90 శాతం తక్కువ ఖర్చుతో వ్యోమగాములను, వస్తువులను కక్ష్యలోకి పంపేందుకు వీలు కలుగుతుంది. ఒక కిలో పేలోడ్‌ను పంపించడానికి కేవలం రూ.2వేలు ఖర్చు అవుతుంది.
- స్పేస్ ఎలివేటర్ కోసం కార్బన్ నానోట్యూబ్‌లను ఉపయోంచి కేబుల్(తెథెర్)ను ఈ సంస్థ
- నిర్మించనున్నది.
- స్పేస్ ఎలివేటర్ నిర్మాణం పూర్తయితే అంతరిక్ష పర్యాటకానికి అవకాశం కలుగుతుందని, అంతరిక్ష మైనింగ్ సులువు అవుతుందని ఈ సంస్థ అంచనా వేస్తున్నది. అంతేకాకుండా రాకెట్లలా ఈ స్పేస్ ఎలివేటర్లు కాలుష్యానికి
- కారణం కాబోవు.