స్పేస్ టూరిజం.. రాకెట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో వర్జిన్ గెలాక్టిక్ ఫ్లైట్స్

ఇప్పటి వరకు టూరిజం అంటే భూమి మీద ఉండే రకరకాల ప్లేసులకు వెళ్లడం వరకే. ఏ కాశ్మీర్ వ్యాలీకో, నయాగరా జలపాతానికో వెళ్లి రావాలన్న ఆశలు ఉండి ఉంటాయి. కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి హద్దులు దాటిపోయేలా ఒక టూర్ వేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచనకే కొత్తగా ఉంది కదా! ఈ తరహా పర్యాటకం సమీప భవిష్యత్తులోనే రాబోతోంది. రోదసిలోకి వెళ్లి జీరో గ్రావిటీ అనుభూతి పొంది, మళ్లీ తిరిగి భూమికి వచ్చేయొచ్చు. ఈ స్పేస్ టూరిజం ఈ ఏడాది చివరిలోపు లేదా వచ్చే ఏడాదిలో  మొదలవ్వబోతోంది.
స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడమంటే భారీ రాకెట్ లాంచింగ్‌‌‌‌‌‌‌‌.. వేల కోట్ల వ్యవహారం అని తెలిసిందే. ఇది కేవలం స్పేస్ ఏజెన్సీలకు చెందిన ఆస్ట్రోనాట్స్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే సాధ్యమయ్యే పని. కానీ రాకెట్ లాంచింగ్ లాంటివేం లేకుండా ఒక విమానంలో వెళ్లినట్టుగానే స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లేలా వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ స్పేస్ ఫ్లైట్లను డెవలప్ చేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే స్పేస్‌‌‌‌‌‌‌‌షిప్ వన్, వీఎస్ఎస్ యూనిటీ, వీఎస్ఎస్ ఇమేజిన్ పేరుతో స్పేస్ ఫ్లైట్లను రూపొందించింది.

100 కిలోమీటర్లు పైకి

మామూలుగా విమానాలు భూమిపై నుంచి 10–14 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అయితే మనం భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి రోదసి బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వాలంటే సముద్రమట్టం నుంచి 100 కిలోమీటర్ల పైకి వెళ్లాలి. అంత దూరం ప్రయాణించగలిగితే మనం జీరో గ్రావిటీలో తేలిపోవచ్చు. భూమి గురుత్వాకర్షణ శక్తి మనల్ని కిందికి లాగలేదు. ఆ జీరో గ్రావిటీ రేంజ్‌‌‌‌‌‌‌‌లోకి టూరిస్టులను తీసుకెళ్లేలా వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా నాలుగు స్పేస్ ఫ్లైట్స్ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి డిమాండ్ పెరిగితే ఏడాదికి 400 ఫ్లైట్స్ వరకు అవసరమైనా ఆశ్చర్యం లేదని కంపెనీ చెబుతోంది.

మేలో కంపెనీ ఓనర్ స్పేస్ సబ్ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌లోకి..

వర్జిన్ గెలాక్టిక్ తయారు చేసిన సెకండ్ జనరేషన్ స్పేస్ ఫ్లైట్ వీఎస్ఎస్ యూనిటీ. ఇది 2018లోనే రెడీ అయింది. దీనిపై ఇన్నేండ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. జీరో గ్రావిటీలోకి వెళ్లి రావడంలో ఇప్పటికే అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్‌‌‌‌‌‌‌‌గా రెడీ అయిన వీఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇమేజిన్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా చేసిన మార్పులేమీ లేవు. కేవలం దాని  ఔటర్ లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్దంలా మెరిసేలా డిజైన్ చేశారంతే. వీఎస్ఎస్ ఇమేజిన్ స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లేటప్పుడు దానిపై మబ్బులు, చుట్టుపక్కల ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ అంతా కనిపించడమే దీని స్పెషాలిటీ. ఈ కొత్తగా తయారు చేసిన దానిలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ ఫౌండర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ మే నెలలో స్పేస్ సబ్ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రయాణించబోతున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ఫ్లైట్ ఆరుగురు ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులతో స్పేస్ జర్నీకి రెడీ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరిలో లేదా 2022 మొదట్లో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టి, స్పేస్ టూరిజాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. ఒక్కో ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి రావొచ్చన్నారు. అయితే దీనికి టికెట్ రేటు ఎంతన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రయాణం ఇట్ల సాగుతది!

  • స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రయాణం అనగానే రాకెట్ లాంచింగ్, నిప్పులు చిమ్ముకుంటూ పైకి వెళ్లడం గుర్తొస్తుంది. కానీ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ స్పేస్ షిప్‌‌‌‌‌‌‌‌లు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. విమానంలో ఎక్కి వెళ్లినట్టే ఉంటుంది.
  • భూమి పైనుంచి స్పేస్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు వర్జిన్ గెలాక్టిక్ ప్రత్యేకంగా ‘వైట్ నైట్‌‌‌‌‌‌‌‌టూ’ అనే ప్లేన్​ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ఈ కేరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లాక దాని నుంచి ‘స్పేస్ ఫ్లైట్’ వేరుపడుతుంది.
  • వైట్ నైట్‌‌‌‌‌‌‌‌టూ నుంచి వేరు పడే సమయంలో స్పేస్ ఫ్లైట్ కూడా రాకెట్‌‌‌‌‌‌‌‌లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది.
  • టార్గెట్ ఫిక్స్ చేసిన ఎత్తుకు రీచ్ అయిన తర్వాత ఫ్లైట్ అడ్డంగా పొజిషన్‌‌‌‌‌‌‌‌లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంజన్ ఆఫ్ అవుతుంది. అక్కడ దానిలోని ప్యాసింజర్స్ జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు. కొంత టైమ్‌‌‌‌‌‌‌‌ తర్వాత తిరిగి భూమిపైకి ప్రయాణానికి రెడీ అవుతుంది.
  • మళ్లీ భూమి వాతావరణంలోకి ఎంటర్ అవుతుంది.
  • ఫైనల్‌‌‌‌‌‌‌‌గా నేలపై ల్యాండింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కి స్పేస్​ ఫ్లైట్​ చేరుకుంటుంది.