ఎల్​ఎన్​జీ ప్రాజెక్టు కోసం .. రష్యా కంపెనీతో స్పేస్​నెట్ ​ఒప్పందం

ఎల్​ఎన్​జీ ప్రాజెక్టు కోసం .. రష్యా కంపెనీతో స్పేస్​నెట్ ​ఒప్పందం

హైదరాబాద్, వెలుగు:  లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జి) ప్రాజెక్టుల కోసం రష్యా కంపెనీ మోడరన్ ఫ్యూయల్ టెక్నాలజీస్​తో కలసి జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని హైదరాబాద్ ఆధారిత లిస్టెడ్ కంపెనీ స్పేస్‌‌‌‌‌‌‌‌నెట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. భారతదేశం అంతటా ప్రాజెక్టులు చేపడతామని తెలిపింది.  2025-–27ఆర్థిక సంవత్సరంలో 20 ఎల్​ఎన్​జీ గ్యాస్ స్టేషన్లు,  ఇంధన రిటైల్ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను ఏర్పాటు చేస్తారు.

 రెండోదశలో 180 ఎల్​ఎన్​జీ గ్యాస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లు,  ఇంధన రిటైల్ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను నిర్మిస్తామని స్పేస్‌‌‌‌‌‌‌‌నెట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాష్ దాసిగి,  మోడరన్ గ్యాస్ టెక్నాలజీస్ జనరల్ డైరెక్టర్ అలెగ్జాండర్ సోరోకిన్ చెప్పారు.  షెల్ ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ  ఔట్‌‌‌‌‌‌‌‌లుక్  ప్రకారం, 2040 నాటికి ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీకి గ్లోబల్ డిమాండ్ 50శాతం పైగా పెరుగుతుందని అంచనా.