స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాటా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈస్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొంత వాటా కొనుగోలు చేశామని  స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3.0, ఈస్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్ మనీ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాజువల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్ చేస్తోంది. ఈ కంపెనీ ఇండియా, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తోంది. ఇండియా, మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్ ఏషియాలో ఈస్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించడానికి ప్లాన్స్ వేస్తోంది. 2028 నాటికి   డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ సైజ్ ప్రస్తుతం ఉన్న రూ.26 వేల కోట్ల నుంచి రూ.62 వేల కోట్లకు చేరుకుంటుందని లుమెకి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోట్ చేస్తూ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్ పేర్కొంది. బిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వాటాను కొన్నాక  స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పెట్టుబడులు పెట్టామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాసిగి అన్నారు.

ALSO READ: ఐదేండ్లలో 6,525 ఫైర్ యాక్సిడెంట్లు