Space X భారీ స్టార్ షిప్ రాకెట్ ఆరో టెస్ట్ ఫైట్ ను పరీక్షించింది. అయితే ప్రయోగం కొంత సక్సెస్.. కొంత ఫెయిల్యూర్ ఉంది.అధిరోహణంలో ప్రయోగం సక్సెస్ కాగా.. తిరిగి భూమి గమ్యస్థానానికి చేరేక్రమంలో ప్రయోగం విఫలమైంది. అంతరిక్ష ప్రయాణం విషయంలో సక్సెస్ సాధించినప్పటికి బూస్టర్ సూపర్ హెవీని తిరిగి పొందే ప్రయత్నం విఫలమైంది. సూపర్ హెవీ బూస్టర్ లాంచ్ టవర్ పై ల్యాండింగ్ తప్పి పోయింది. అయితే సురక్షితంగా గల్ప్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయింది.
చంద్రునిపై ల్యాండింగ్, మార్స్ మిషన్ల కోసం రూపొందించిన 122 మీటర్ల రాకెట్ వ్యవస్థను బుధవారం తెల్లవారుజామున(నవంబర్ 20) టెక్సాస్ లోని బొకాచికా నుంచి ప్రయోగించారు. ఈ భారీ స్టార్ ఫిస్ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు అమెరికా డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ ఫైండర్ ఎలాన్ మస్క్ వచ్చారు. ఇది ఎలాన్ మస్క్, ట్రంప్ కు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. అయితే ప్రయోగ ఫలితం కొంత నిరాశపర్చింది. మొదటి దశ ప్రయోగం సక్సెస్ ఫుల్ అయిన్పటికీ తిరుగు ప్రయాణం విఫలం అయింది.
Also Read : హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు వచ్చేస్తోంది
— Elon Musk (@elonmusk) November 20, 2024
గత నెలలో ఈ స్టార్ షిప్ పరీక్ష సక్సెస్ ఫుల్ అయింది. సరికొత్త క్యాచ్ ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతంగా చేశారు.బుధవారం ప్రయోగం కొంత నిరాశపర్చినప్పటికీ కొన్ని మిషన్ లక్ష్యాలు నెరవేరాయి.