స్పెయిస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కు బ్యాడ్ న్యూస్. ఇటీవల స్పెయిస్ ఎక్స్ సంస్థ లాంచ్ చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సెకండ్ ఇంజన్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఫాల్కన్ 9 రాకెట్ లో ప్రయోగించబడ్డ 20 స్టార్‌లింక్ శాటిలైట్లు.. వాటిని ప్రవేశపెట్టాలనుకున్న దానికంటే తక్కువ కక్ష్యలో ఉండిపోయాయి. 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు డేంజర్ జోన్ లో ఉన్నాయని స్పెయిస్ ఎక్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల 20 స్టార్ లింక్ శాటిలైట్లు క్రాష్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. స్పెయిస్ ఎక్స్ వాటిని రక్షించేదుకు ప్రయత్నిస్తుందని ఆ కంపెనీ సీఈఓ ఎలన్ మాస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
రాకెట్ ప్రయాణించడానికి రెండవ స్టేజ్ లో ఇంజన్ పని చేయకపోవడమే ఇందుకు కారణమని సైంటిస్టులు చెప్పారు. భూమి నుంచి ఉపగ్రహాల ఎత్తు తక్కువగా ఉన్నందున వాతావరణం వాటిని లాగుతుందని.. దీంతో అవి క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని స్పెయిస్ ఎక్స్ సంస్థ నిపుణులు తెలిపారు. శాటిలైట్ల ఎత్తు పెంచడానికి ఆన్‌బోర్డ్ అయాన్ థ్రస్టర్‌లను ఉపయోగిస్తున్నారు.