
ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురవడం హాలీవుడ్ సినిమాల్లో చూసి ఉంటాం. కానీ అలాంటి ఘటనే శుక్రవారం అంతరిక్షంలో జరిగింది. ప్రయోగించిన నిమిషాల్లోనే రాకెట్ పేలి పోవడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి.. నిప్పుల వర్షం కురవడం భయాందోళనకు గురి చేసింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ (SpaceX) ప్రయోగించిన రాకెట్ ఆకాశంలో ఒక్క సారిగా పేలిపోయింది. భారీ శబ్దాలతో ముక్కలు ముక్కలైంది. ఆకాశంలో మంటలు చెలరేగి తునాతునకలుగా భూమిపై పడిపోవడం భయభ్రాంతులకు గురిచేసింది.
Just saw Starship 8 blow up in the Bahamas @SpaceX @elonmusk pic.twitter.com/rTMJu23oVx
— Jonathon Norcross (@NorcrossUSA) March 6, 2025
మార్చి,7 శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం) స్పేస్ ఎక్స్ కేంద్రం నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ (Starship) కంట్రోల్ తప్పి నిమిషాల వ్యవధిలోనే పేలి పోయింది. ఇంజిన్ ఆగి పోవడంతో సౌత్ ఫ్లోరిడా బహమాస్ ప్రాంతాల్లో తునాతునకలై కూలిపోయింది.
Also Read :- అమెరికాలో డజన్ కోడిగుడ్లు వెయ్యి రూపాయలు
మియామి, ఫోర్ట్ లాడెరల్, పాల్మ్ బీచ్, ఓర్లాండో ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాయంత్రం 8 గంటల వరకు శకలాలు పడతాయని గ్రౌండ్ క్లియరెన్స్ చేయించారు వైమానిక అధికారులు.
లాంచ్ చేసిన కొన్ని నిమిషాలకే ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ షిప్ కంట్రోల్ కోల్పోయిందని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. స్పేస్ షిప్ విఫలం కావడంలో జరిగిన లోపాన్ని విశ్లేషింకుచుంటామని సైంటిస్టులు తెలిపారు.
మార్స్ రాకెట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. స్పేస్ షిప్ లు ఫెయిల్ అవ్వడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి.