రష్యా మూడున్నర గంటల్లోనే వస్తే.. స్పేస్ ఎక్స్ డ్రాగన్ 17 గంటల సమయం ఎందుకు..?

రష్యా మూడున్నర గంటల్లోనే వస్తే.. స్పేస్ ఎక్స్ డ్రాగన్ 17 గంటల సమయం ఎందుకు..?

అంతరిక్ష స్పేస్ సెంటర్ (ISS) నుంచి భూమిపైకి క్షేమంగా తిరిగొచ్చారు సునీత విలయమ్స్, బుక్ విల్మోర్, నిక్ హాగ్, అలగ్జాండర్ బోర్బనవ్.. ఈ నలుగురు వ్యోమగాములు సురక్షింగా భూమిపై ల్యాండ్ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే కొన్ని ఆసక్తికర అంశాలు చర్చగా మారాయి. 

రష్యాకు చెందిన స్పేస్ షెటిల్ సోయుజ్ వ్యోమనౌక అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచి కేవలం మూడున్నర గంటల్లోనే భూమిపైకి ల్యాండ్ అవుతుంది.. అదే స్పేస్ ఎక్స్ డ్రాగన్ మాత్రం 17 గంటల సమయం తీసుకున్నది. ఎందుకీ తేడా.. ఎందుకు 10 గంటల సమయం తేడా ఉన్నది అనేది వివరంగా తెలుసుకుందాం..

>>> అంతరిక్షంలోని స్పేస్ సెంటర్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. దానికి కనెక్ట్ అయ్యే స్పేస్ షటిల్.. వ్యోమనౌక అన్ లాక్ చేసిన క్షణంలోనే స్పేస్ ఎక్స్ డ్రాగన్ వెంటనే కిందకు దిగదు.. అదే కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అదే రష్యాకు చెందిన సోయుజ్ షెటిల్ అయితే అన్ లాక్ అయిన వెంటనే దాన్ని ఉన్న ఇంధనాన్ని మండించి కింద కక్ష్యలోకి తీసుకొస్తారు. దీంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఇక్కడే రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకుంది. 

Also Read:-సునీతా విలియమ్స్ను ఎక్కడకు తీసుకెళ్లారంటే..

>>> స్పేస్ ఎక్స్ డ్రాగన్ షెటిల్.. వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించే ముందు నాలుగు దశల్లో పని చేస్తుంది. 420 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూ కక్ష్యలోకి వచ్చే వరకు 50 నుంచి 60 కిలోమీటర్ల ఎత్తును తగ్గించుకుంటూ ఆయా కక్ష్యల్లో తిరుగుతూ నిదానంగా వస్తుంది. అదే రష్యా సోయుజ్ వ్యోమనౌక డియోర్బిట్ బర్నల్స్ ను మండించి.. నేరుగా భూ కక్ష్యలోకి ప్రవేశించే విధంగా వేగంగా కిందకు దిగుతుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ నాలుగు దశల్లో కిందకు దిగుతూ.. ఆయా కక్ష్యల్లో తిరగుతూ రావటం వల్ల మరింత సమయం పడుతుంది. అదే రష్యా సోయుజ్ నేరుగా భూ కక్ష్య వరకు ఒకే సారి దిగుతుంది. దీని వల్ల నాలుగు గంటల సమయం తేడా వస్తుంది. 

>>> భూ కక్ష్యలోకి వ్యోమనౌక ప్రవేశించిన తర్వాత రెండు క్యాప్సూల్స్ (వ్యోమనౌకలు) అది రష్యా సోయూజ్ అయినా.. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అయినా.. ఒకే విధంగా జాగ్రత్తలు, టైం తీసుకుంటారు. దీనికి కారణం భూవాతావరణంలోకి క్యాప్సూల్స్ వేల కిలోమీటర్ల వేగంగా రావటం, వేడి తీవ్రత, భూ గురుత్వాకర్షణ శక్తి లాగటం వంటి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికితోడు స్పేస్ షిటిల్, అందులోని సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల భూ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బాలిస్టిక్ బర్నల్స్ ను మండిస్తూ.. వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ భూమి వైపు అంతరిక్ష నౌక ప్రయాణం ఉంటుంది. 

>>> రష్యా సోయుజ్ అంతరిక్ష నౌక.. స్పేస్ ఎక్స్ డ్రాగన్ రెండు ప్రయోగాల మధ్య టైం గ్యాప్ కు కారణం ఇదే. స్పేస్ నుంచి భూ కక్ష్య మధ్య ఉన్న దూరాన్ని రష్యా సోయుజ్ ఒకే దశలో పూర్తి చేస్తే.. స్పేస్ ఎక్స్ డ్రాగన్ మాత్రం నాలుగు, ఐదు దశల్లో నిర్వహిస్తుంది. 

అందువల్లే స్పేస్ ఎక్స్ డ్రాగన్ షెటిల్ 17 గంటల సమయం తీసుకుంటే.. రష్యా సోయుజ్ మాత్రం కేవలం మూడున్నర గంటల సమయంలోనే స్పేస్ స్టేషన్ నుంచి భూమికి వస్తుంది.