స్పేస్‌ఎక్స్ ఫ్రేమ్2 మిషన్ సక్సెస్..భూమిపైకి తిరిగొచ్చిన వ్యోమగాములు

స్పేస్‌ఎక్స్ ఫ్రేమ్2 మిషన్ సక్సెస్..భూమిపైకి తిరిగొచ్చిన వ్యోమగాములు

భూమి ఉత్తర,దక్షిణ ధ్రువాల మీదుగా కక్ష్యలోకి వెళ్ళిన మొదటి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.ఎలాన్ మస్క్ SpaceX ఫ్రేమ్2 మిషన్ సక్సెస్ అయింది.భారత కాలమాన ప్రకారం..శనివారం(ఏప్రిల్5) తెల్లవారు జామున వ్యోమగాముల డ్రాగన్ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంంలో పారాచూట్ ద్వారా కాలిఫోర్నియాలోని ఓషన్ సైడ్ తీరంలో దిగింది. 

వ్యోమగాములు మూడు రోజులపాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం భూమికి తిరిగి వచ్చారు. మాల్టీస్ క్రిప్టోకరెన్సీ బిలియనీర్ చున్ వాంగ్ ఫ్రేమ్2 కు నిధులు సమకూర్చాడు.సిబ్బంది శిక్షణ ,అంతరిక్ష ప్రయాణ సమయంలో మిషన్ కమాండర్‌గా పనిచేశాడు. డ్రాగన్ కమాండర్‌గా నియమించబడిన తోటి ధ్రువ అన్వేషకులు నార్వేకు చెందిన జానికే మికెల్సెన్, మిషన్ పైలట్‌గా జర్మనీకి చెందిన రాబియా రోగే, మిషన్ స్పెషలిస్ట్ ,మెడికల్ ఆఫీసర్‌గా ఆస్ట్రేలియన్ ఎరిక్ ఫిలిప్స్ చున్‌తో వ్యోమగాముల్లో ఉన్నారు. 

భూమి ధ్రువ ప్రాంతాలను మొదటిసారిగా అన్వేషించడానికి ధ్రువ కక్ష్యలో దాదాపు నాలుగు రోజులు ప్రయాణించిన తర్వాత, డ్రాగన్ ,Fram2 సిబ్బంది ఏప్రిల్ 5శనివారం నాడు భూమికి తిరిగివచ్చారు.కాలిఫోర్నియా తీరంలో శనివారం తెల్లవారు జామున సక్సెస్ ఫుల్గా ల్యాండ్ అయ్యారు. మిషన్ సమయంలో డ్రాగన్ సిబ్బంది, దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణ కోసం మానవుల ఆరోగ్యం, సామర్థ్యం అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు22 పరిశోధన అధ్యయనాలు చేసేందుకు ఈ మిషన్ లక్ష్యంగా ప్రయోగించారు. 

ఈ ట్రిప్ లో సిబ్బంది అంతరిక్షంలో మొదటి ఎక్స్-రే తీసుకున్నారు.కండరాలు,అస్థిపంజర ద్రవ్యరాశిని మెయింటెన్స్ పై అధ్యయనం చేశారు. మైక్రోగ్రావిటీ లో పుట్టగొడుగులను పెంచారు. సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య సహాయం లేకుండా తిరిగి రావడంపై ప్రయోగాలు చేశారు. ది క్రూ మిషన్ కమాండర్ చున్ వాంగ్, వెహికల్ కమాండర్ జానికే మిక్కెల్సెన్, వెహికల్ పైలట్ రాబియా రోగ్ ,మిషన్ స్పెషలిస్ట్ ,మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్స్ లకు ఇది మొదటి మానవ అంతరిక్ష ప్రయాణం.