హైదరాబాద్లో ఫస్ట్ టైం టమాటో ఫెస్టివల్..ఎక్కడ ఎన్ని గంటలకంటే.?

హైదరాబాద్లో ఫస్ట్ టైం టమాటో ఫెస్టివల్..ఎక్కడ ఎన్ని గంటలకంటే.?

టొమాటో ఫెస్టివల్‌‌‌‌ అనగానే స్పెయిన్‌‌‌‌ గుర్తొస్తుంది. ‘లా టొమాటినా’ పేరుతో జరిగే ఈ పండుగతో అక్కడి బునోల్‌‌‌‌లో జరిగే సందడి అంతా ఇంతా కాదు. స్పెయిన్‌‌‌‌లోని వాలెన్సియా దగ్గర ఉన్న బునోల్‌‌‌‌లో ఏటా ఆగస్టు చివరి బుధవారం టొమాటో ఫెస్టివల్‌‌‌‌ జరుగుతుంది. వేలల్లో జనాలు వీధుల్లోకి వచ్చి టమాటలతో కొట్టుకుంటారు. తొలిసారి 1945లో ఇది మొదలైంది.  

తాజాగా ఇపుడు  ఈ లిస్ట్ లో మన హైదరాబాద్ చేరబోతుంది. అవును భారతదేశంలోనే తొలిసారి  ప్రిజం అవుట్‌డోర్స్ మన హైదరాబాద్ లో టొమాటో ఫెస్టివల్ ను నిర్వహించేందుకు సిద్దమైంది. 

మే11న ఉదయం 10 గంటలకు  హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో 160 ఎకరాల్లోఈ  టమోటా ఫెస్టివల్ జరగబోతుంది.  దీని కోసం ఇప్పటికే 1000 కేజీల వరకు  టమోటాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరినొకరు టమాటలతో కొట్టుకుంటూ సందడి చేస్తారు.   ఈ ఫెస్టివల్ లో మ్యూజిక్, క్రేజీ ఫన్ జోన్ ,డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు.  రుచికరమైన వంటలతో పలు రకాలను ఫుడ్ ను కూడా తినేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.  అయితే ఈ ఫెస్టివల్ కు ఒక్కొక్కరికి టికెట్ ధర  రూ. 499 నుంచి 3499 వరకు ఉంది.

►ALSO READ | వాహన సారథిలోకి తెలంగాణ.. ఇక డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరింత ఈజీ