పారిస్‌ ఒలింపిక్స్.. స్పెయిన్‌ బోణీ

పారిస్‌ ఒలింపిక్స్.. స్పెయిన్‌ బోణీ

పారిస్‌: పారిస్‌ ఒలింపిక్స్​లో ఫుట్‌బాల్‌ పోటీల్లో స్పెయిన్‌ బోణీ చేసింది. ఓపెనింగ్‌ సెర్మనీకి ఒక్క రోజు ముందుగానే మొదలైన గ్రూప్‌–సి తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ 2–1తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచింది. స్పెయిన్‌ తరఫున పుబిల్‌ మార్క్‌ (29వ ని.), సెర్గియో (62వ ని.) గోల్స్‌ చేశారు. అయితే గ్రూప్‌–బి మ్యాచ్‌లో అర్జెంటీనాకు షాక్ తగిలింది. మొరాకో 2–1తో అర్జెంటీనాను ఓడించింది.  రహీమ్‌ సౌఫియానె (47, 49వ ని.) రెండు గోల్స్‌ కొట్టి మొరాకోను గెలిపించాడు. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 2–1తో గినియాపై నెగ్గింది.