Spanish City fine: మనం అప్పడప్పుడు టూర్లకు వెళ్తుంటాం. మన దేశంలో, రాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలను చూసేందేుకు సరదాగా గడిపేందుకు షెడ్యూల్ వేసుకొని కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని పోతుంటాం. దేశంలోనే కాకుండా అప్పుడప్పుడు విదేశాల్లో ఉన్న టూరిస్టు ప్లేస్ లకు కూడా వెళ్తుంటాం. విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడి ప్రాంతాల్లో కొన్ని నియమ నిబంధనలు కూడా తెలిసి ఉండాలి. లేకుంటే ఫైన్, జైలు శిక్షలు కూడా పడుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మీరు స్పెయిన్ వెళ్లాలనుకుంటే.. అక్కడ ఉన్న టూరిజం స్పాట్ లలో కొన్ని కొత్త నిబంధనలు పెట్టారు.. వాటి గురించి తెలుసుకోకపోతే.. పొరపాటున ఉల్లంఘించారో..ఫైన్ తప్పదు.. అవేంటో తెలుసుకుందాం.
స్పెయిన్ లోని మార్బెల్లా నగరంలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రాంతం సముద్ర బీచ్ ఉంది. అక్కడికి రోజులు వేలల్లో పర్యాటకులు వస్తుంటారు.. సముద్రబీచ్ లో ఎంజాయ్ చేస్తుంటారు. మరి పర్యాటకులు ఎక్కువ గా వస్తున్నారంటే అక్కడి శానిటేషన్, వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువగా గానే ఉంటుంది..వ్యర్థాలు పేరుకుపోతాయి. బ్యాడ్ స్మెల్ లాంటివి వస్తుంటాయి.. ఇలా అనేక పర్యావరణ పరమైన సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు స్పెయిన్ పర్యాటక శాఖ ఓ నిర్ణయం తీసుకుంది.
స్పెయిన్ లోని మరా్బెల్లా నగరంలోని సముద్ర బీచ్ లో పరిశుభ్రత, సానిటరీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు సముద్రం మూత్ర విసర్జన చేస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది. పొరపాటున సముద్రంలో మూత్ర విసర్జన చేశారంటే రూ. 67 వేల ఫైన్ విధిస్తున్నారట. ఇది రిపీట్ అయితే జైలుతో పాటు లక్ష రూపాయల జరిమాని కూడా విధిస్తారట.
ఫైన్ విషయంలో అధికారులు మంచినిర్ణయమే తీసుకున్నారు గానీ.. దీనికి చట్టంగా మారడానికి ముందు ప్రజా సంప్రదింపులు అవసరమట.. జనాల మధ్య నేరస్థులను లైఫ్ గార్డులు ఎలా గుర్తిస్తారనే అసలు సమస్య అని విషయం గురించి విన్న కొందరు స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారట.
స్పెయిన్ లో మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేసినందుకు జరిమానా కొత్తదేమీ కాదు.. గతంలో అంటే 2004లో మలాగా బీచ్ లో కూడా ఫైన్ విధించారు. దీంతో గలీషియన్ నగరంలోని విగో లో కూడా రెండేళ్ల క్రితం పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.