కొందరికి కొన్ని రకాల హాబీలు ఉంటాయి.. కొందరు కాయిన్స్ కలెక్ట్ చేస్తే.. కొందరు స్టాంపులు కలక్ట్ చేస్తుంటారు.. కొందరు రూపాయి నోట్లు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హామీని మెయింటెన్ చేస్తుం టారు..బహుమతులు, అవార్డు, రికార్డులు నెలకొల్పుతుంటారు..అయితే ఓ వ్యక్తి ఫోన్లను సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు..సెల్ ఫోన్లను సేకరిస్తే కూడా రికార్డు సృష్టించవచ్చా అని అనుకోవచ్చు..ఇది నిజం..
వెన్నెస్ పలావ్ ఫెర్నాండెజ్.. స్పానిష్ వ్యక్తిం.. అతను నోకియా ఫోన్లకు పెద్ద అభిమాని.. ఈ అభిరుచి కాస్త అతను గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేలా చేసింది.ఫెర్నాండెజ్ ఏకంగా 3వేల 615 నోకియా మోడళ్లను సేకరించి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2023లో రొమేనియాకు చెందిన ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ పేరిట ఉన్న 3వేల 456 ఫోన్ల రికార్డును అధిగమించాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్) ..ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఫెర్నాండెజ్ సిమెన్స్, ఎన్‌ఇసి, మోటరోలా, బ్లాక్‌బెర్రీ, శామ్‌సంగ్, హెచ్‌టిసి, యాపిల్ , అనేక ఇతర ఫోన్లను సేకరణను గర్వంగా ప్రదర్శించాడు. అతని అత్యంత విలువైన వస్తువులలో నోకియా 3220 స్టార్ వార్స్ Ep III వంటి అరుదైన, పరిమిత- ఎడిషన్ మోడళ్లు ఉన్నాయి. ఇందులో యోడా, స్టార్‌ఫైటర్, ఒబి-వాన్ కెనోబి, సైబోర్గ్ , పడవాన్‌లచే ప్రేరణ పొందిన డిజైన్‌లు ఉన్నాయి.
GWR వెబ్‌సైట్ ప్రకారం..మొబైల్ ఫోన్‌ల పట్ల ఫెర్నాండెజ్‌కు ఉన్న మక్కువ 1999లో క్రిస్మస్ కానుకగా అందుకున్న బూడిద రంగు నోకియా 3210తో మొదలైంది. అతను 2008లో నోకియాస్‌ని సేకరించడం ప్రారంభించాడు. అతను మునుపు కోల్పోయిన అన్ని Nokia మోడల్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. అతని సేకరణ పెరిగేకొద్దీ, అది త్వరలోనే అతని డిస్‌ప్లే క్యాబినెట్ సామర్థ్యాన్ని అధిగమించింది. సేకరించిన నోకియా ఫోన్లతో మొత్తం గదిని నింపడం ప్రారంభించారు. 2018 నాటికి ఫెర్నాండెజ్ 700 కంటే ఎక్కువ నోకియా మోడల్‌లను సేకరించాడు. ఇతర బ్రాండ్‌లు, వాణిజ్యపరంగా విడుదల చేయని ఫోన్లను కూడా సేకరించాడు.
నోకియా ఫోన్లు సేకరణలో గట్టి పట్టుదలతో ముందుకు సాగినప్పటికి మధ్యలో ఒక సంవత్సరం పాటు వదిలివేశాడు.తర్వాత తిరిగి ప్రారంభించి నోకియా మార్కెట్లోకి విడుదల చేసి అన్ని ఫోన్లతో పాటు, విడుదల చేయని వాటిని కూడా సేకరించే పనిలోపడ్డాడు..ఎట్టకేలకు సాధించాడు.
ఫెర్నాండెజ్ తన సొంత వెబ్‌సైట్.. నోకియా ప్రాజెక్ట్ డ్రీమ్‌లో తన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ వైపు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేశాడు. "నా సేకరణలు చాలా ప్రత్యేకమైనవి , మోడళ్లను కనుగొనడం కష్టం అని అతను తన సైట్‌లో రాశాడు. అటువంటి ప్రయత్నానికి అవసరమైన ముఖ్యమైన పట్టుదల , ఆర్థిక పెట్టుబడిని కూడా కావాలని గుర్తించాడు.
ర్నాండెజ్ తన సేకరణను ప్రపంచానికి ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్రపంచ రికార్డుసాధించాడు. కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చనే నానుడి గుర్తుకొస్తుంది గదా .. ఫెర్నాండెజ్ ను చూస్తే.. మీరూ ఏదైనా రికార్డు బ్రేక్ చేసే పని ప్రారంభించండి.. ఆల్ ది బస్త్..