
మాడ్రిడ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. మాడ్రిడ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. కుడి కాలి గాయం కారణంగా తాను ఈ టోర్నీకి అందుబాటులో ఉండటం లేదని అల్కరాజ్ గురువారం వెల్లడించాడు. ‘బార్సిలోనా ఓపెన్‌లో అయిన గాయం ఇంకా తగ్గలేదు. ఎడమ కాలికి కూడా స్వల్పంగా గాయమైంది. కాబట్టి ఈ రెండు గాయాల నేపథ్యంలో మాడ్రిడ్ ఓపెన్‌లో ఆడటం లేదు’ అని అల్కరాజ్ పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో అల్కరాజ్ 2022, 2023లో చాంపియన్‌గా నిలిచాడు. హోల్డర్ రూనెతో జరిగిన బార్సిలోనా ఫైనల్లో కాలి గాయంతో అల్కరాజ్ వరుస సెట్లలో ఓడిపోయాడు. తర్వాత గాయానికి చికిత్స తీసుకున్నా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో మాడ్రిడ్‌లో ప్రాక్టీస్ కూడా చేయలేదు.