ఎస్సార్ యూనివర్సిటీలో ముగిసిన  స్పార్కల్స్​ 24

హసన్ పర్తి,వెలుగు:  హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులో గల ఎస్సార్ యూనివర్సిటీలో స్పా ర్కల్స్​ –24  మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు శుక్రవారం రాత్రి  ముగిశాయి.    శుక్రవారం రాత్రి స్టూడెంట్లు డాన్సులు, పాటలు , నాటకాలు ప్రదర్శనలు నిర్వహించారు.  

   గాయకుడు రామ్ మిరియాల, పాడుతా తియ్యగా సేమి ఫైనలిస్ట్​  శ్రీనివాస్ భరద్వాజ, గాయకురాలు సింధూజ శ్రీనివాసన్ పాటలతో ఉర్రూతలూగించారు.  స్టూడెంట్లు చిందులు వేస్తూ కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో  యూనివర్సిటీ వీసీ వరద రెడ్డి , రిజిస్టార్ డాక్టర్ అర్చన రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్   డాక్టర్ ఎవీవీ  సుధాకర్ పాల్గొన్నారు.