కోనా కార్పస్ చెట్టుపైన పిట్ట కూడా కూర్చోదు: స్పీకర్ గడ్డం ప్రసాద్

 కోనా కార్పస్ చెట్టుపైన పిట్ట కూడా కూర్చోదు: స్పీకర్ గడ్డం ప్రసాద్

 తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్ కవరేజీని పెంచాలని..అడవులనుపెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గొప్పగా హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. పదేళ్లలో 10 వేల 822 కోట్లు ఖర్చు చేసి 273 కోట్ల మొక్కలు నాటారని చెప్పారు. ప్రతీ గ్రామంలో నర్సరీలు, పల్లెవనాలు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ తెచ్చిన హరితహారం వల్ల 7 శాతం గ్రీన్ కవరేజ్ పెరిగిందని  అన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read:-బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపుల్లో కూడా మద్యం అమ్మినారు

బీఆర్ఎస్ హయాంలో 273 కోట్ల మొక్కలు నాటారని చెబుతున్నారు. అయితే పనికిరాని మొక్కలను కూడా నాటారు. కోనాకార్పస్ అనే మొక్క ఉంటుంది. దీనికి నీళ్లు అవసరం లేదు..ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఇది ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ ను వదులుతుంది. ఇలాంటి మొక్కలపైన పిట్టలు కూడా కూర్చోవు..ఇలాంటి మొక్కలను తెలంగాణ వ్యాప్తంగా నాటారు. ఏ ఊరు ..ఏ రోడ్డు చూసినా ఇలాంటి మొక్కలే ఉన్నాయి.  ఇలాంటి మొక్కలు రాష్ట్రంలో ఎక్కడున్నా తొలగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అని స్పీకర్ అన్నారు.