
వికారాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన 7వ మాస్టర్ గేమ్స్ తెలంగాణ స్టేట్ చాంపియన్ షిప్- 2025 జావెలిన్ త్రో పోటీల్లో (70 ఏళ్ల కేటగిరీ) వికారాబాద్‌కు చెందిన ఎండీ హఫీజ్ సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంతో మెరిట్ సర్టిఫికెట్ సాధించారు.
ఈ నేపథ్యంలో వికారాబాద్‌లో ఎండీ హఫీజ్‌ను బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఎస్.రామచంద్రారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.