రైతులకు అన్యాయం జరగొద్దు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్

మెహిదీపట్నం, వెలుగు: నాలుగేండ్లుగా గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ లేకపోవడం దురదృష్టకరమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​గా తలారి మల్లేశ్, వైస్ చైర్మన్​గా కావలి చంద్రశేఖర్, ఇతర సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ హాజరై మాట్లాడారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు కమిటీలో తమకు చోటు కల్పించకుండా అన్యాయం చేశారని స్థానిక కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మూడు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేయగా, శుక్రవారం వారిని పోలీసులు అరెస్టు చేసి మధ్యాహ్నం వరకు పీఎస్​లో ఉంచారు.