నష్టపోయిన రైతులను ఆదుకుంటాం... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​

వికారాబాద్, వెలుగు: వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మోమిన్ పేట మండలంలోని కాసులాబాద్ చెరువు వాగు బ్రిడ్జిని, మల్ రెడ్డి గూడ, వెలిచాల్ లో కూలిన ఇండ్లను, రామనాథ్ గూడ పల్లి లో నీటితో నిండిన ఆర్​యూబీని మంగళవారం ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. వర్షం వల్ల కూలిపోయిన ఒక్కో ఇంటికి రూ. 3,200లను అందిస్తామని, పశువులు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. రామనాథ్గుడ్ పల్లి, మల్ రెడ్డి గూడ, గోవిందాపురం లో ఆర్​యూబీ, రోడ్ల కు త్వరలోనే రిపేర్లు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ వాసుచంద్ర, మోమిన్​పేట స్పెషల్​ ఆఫీసర్​ పూర్ణ చంద్ర రావు, నాయకులు శంకర్ యాదవ్, సుభాశ్​, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.