వికారాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వికారాబాద్మండలం పెండ్లిమడుగులో ఆదివారం సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో మరో నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గత పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని, ఇప్పుడు అర్హులందరికీ ఇస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగైన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. కొడంగల్: కొడంగల్మండలం అన్నారంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను కలెక్టర్ ప్రతీక్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు.