![అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/speaker-gaddam-prasad-kumar-promises-to-provide-a-house-to-every-deserving-poor_P14BYQdfCt.jpg)
వికారాబాద్, వెలుగు: అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం వికరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహానికి భూమి పూజ చేశారు. ప్రాధాన్యత ప్రకారం.. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. ఇండ్ల కోసం ఎంపిక లో ఎలాంటి అవకతవకలు జరగకుండా.. అర్హులైన వారిని ఎంపిక చేసి లబ్ధి చేకూరే విధంగా అధికారులు, నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం కోట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.