ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది :  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది :  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

 ఆమనగల్లు, వెలుగు: ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.  మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్ప గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ కూచుకుల్ల రాజేశ్  రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..   ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.  కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  మల్లికార్జున స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యేతో పాటు తన వంతు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు భక్తులు పాల్గొన్నారు.