టీచర్ల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకుపోతా : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

  • పీఆర్టీయూటీ నేతలతో  స్పీకర్​ గడ్డం ప్రసాద్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల పెండింగ్ బిల్లులు త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జీవో 317 బాధిత టీచర్లకు న్యాయం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. టీచర్ల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకుపోయి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం పీఆర్టీయూటీ రూపొందిందిన డైరీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, మహమ్మద్ అబ్దుల్లాతో కలిసి స్పీకర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో పాటు  రిక్రూట్మెంట్ ను తక్కువ కాలంలోనే కాంగ్రెస్ సర్కారు నిర్వహించిందన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తున్న సర్కారుకు మద్దతుగా ఉండాలని స్పీకర్ కోరారు.