నేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..అసలేం జరిగిందంటే..?

నేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..అసలేం జరిగిందంటే..?

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకు గౌరవమని.. మహిళలంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తనకు 8 మంది సిస్టర్స్ ఉన్నారని చెప్పారు.  రన్నింగ్ కామెంట్స్ చేస్తుండగా అందరు ఒకేసారి మాట్లాడుతున్నారు.. ఆ సమయంలో నాకే వినబుద్ది కావడం  లేదు మీకు వినిపిస్తుందా? అని అన్న కానీ  ప్రత్యేకంగా మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఒక వేళ  మీ  మనసుకు భాద కల్గించి ఉంటే నా వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటా అని స్పీకర్ బదులిచ్చారు. 

నేను చాలా బాధపడ్డ: సునీత 

అంతకు ముందు మాట్లాడిన సునీతా లక్ష్మారెడ్డి  తాను సబ్జెక్ట్ పైన మాట్లాడాను ఏనాడు పరిధి దాటి మాట్లాడలేదు.మార్చి 24న అసెంబ్లీలో మీరు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధ కల్గించాయి.  మీరు నన్ను ఉద్దేశించి  వ్యాఖ్యలు చేశారని బయటకు వెళ్లాక మా సభ్యులు చెప్పారు. మీరు అలా మాట్లాడుతారని అనుకోలేదు.నాకు చాలా బాధ కల్గింది.  సీఎం చాలా సార్లు మహిళలను ఉద్దేశించి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా పద్దతిగా  నిరసన తెలిపినం కానీ..ఏనాడు పరిధి దాటి మాట్లడలేదు..మీరు ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నా అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Also Read : MLA ల ఫిరాయింపు కేసు అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్​ దాఖలు

స్పీకర్ ఏమన్నారంటే.?

మార్చి 23న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా..సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా చాలా మంది  రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు. సభలో గందరగోళం ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అపుడు నాకే వినాలనిపిస్తలేదు..మీకు వినిపిస్తుందా అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి మాట్లాడినవేనని సునీతా లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. మార్చి 25న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే  స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను అనుకోలేదనని..తన మనసుకు బాధ కల్గించిందని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్..తాను ఎవరిని ఉద్దేశించి అనలేదని..మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..ఒక వేళ మీకు బాధ కల్గిస్తే ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నానని చెప్పారు