NH 63 హైవే పనులకు 100కోట్లు: నితిన్ గడ్కరీతో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భేటీ

హైదరాబాద్:జాతీయ రహదారుల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. NH63 రోడ్డు విస్తరణ, కొత్త రోడ్లను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ణతలు తెలిపారు. 

ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. NH63విస్తరణ, కొత్త రోడ్ల మంజూరుకు ఇంతముందే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ణప్తి చేశాం. రోడ్లు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ణతలు తెలిపారు.  

ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ణప్తి మేరకు 100కోట్లతో NH 63రోడ్డు విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. మరో 15 రోజులు 1కోటి 80లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్నారు. చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని హైవే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

Also Read:-ప్రతి ధాన్యం గింజ కొంటాం

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జోడవాగు రోడ్డు పనులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి,చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మరమ్మతు పనులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ణప్తి చేశారు.

రిపేర్ వర్క్స్ తక్షణమే చేయాలని కేంద్రమంత్రి ఆదేశించారు.. NH63 విస్తరణ, కొత్త రోడ్డుకోసం100 కోట్ల రూపాయల ప్రాజెక్టు మంజూరు చేసినందుకు స్పీకర్ ప్రసాద్ తో కలిసి ధన్యవాదాలు తెలిపామన్నారు. త్వరంలో చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గాల ప్రజలకు రోడ్డు సౌకర్యాలు అందించేలా తక్షణమే పనులు ప్రారంభిస్తామన్నారు ఎంపీ గడ్డం వంశీవృష్ణ. 

 రైల్వే బోర్డ్ చైర్మన్ ను కలిసి రామగుండంలో వందే భారత్ రైలు ఆగేలా చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపామన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేరళ ఎస్ప్రెస్ హల్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాం.. బెల్లంపల్లి నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. 

ఎన్నికల సమయంలో పెద్దపల్లి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరింత కృషి చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.