- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: లైబ్రరీలు ఆధునిక విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. నిరుద్యోగులకు ప్రతి గ్రంథాలయం కల్పవృక్షంగా మారాలని చెప్పారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎస్.రాజేశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ముఖ్య అతిథులుగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు రమేష్ ముదిరాజ్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి లైబ్రరీకి పక్కా, శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు. అన్ని రకాల పుస్తకాలు అందుబా టులో ఉంచాలన్నారు. లైబ్రరీలకు ఏ చిన్న అవసరం వచ్చినా సంప్రదించాలని చెప్పారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎస్.రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. లైబ్రరీల్లో అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని, జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్ లోని రాజీవ్‌గృహకల్ప ప్రాంతంలో అడ్వాన్సుడ్టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. రూ.5 కోట్ల అంచనాతో ఈ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.