డిచ్పల్లి, వెలుగు: డిచ్పల్లి మండలం బర్దీపూర్వద్ద కొత్తగా ఏర్పాటైన కియా కార్ల షోరూమ్‌ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కియా లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తన షోరూమ్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
ఈ సందర్భంగా కియా ఈవీ6 ఎలాక్ట్రిక్కారు ను లాంచ్ చేశారు. కార్యక్రమంలో కియా ఇండియా రీజినల్మేనేజర్జాంగో రైయు, పోచారం సురేందర్‌రెడ్డి, రవి కిరణ్గౌడ్గిల్ల, ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు.