నీట్, కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చించాలని లోక్ సభలో స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్. 2024, జూలై1వ తేదీ సోమవారం లోక్ సభ సమావేశం ప్రారంభమైంది. నీట్, కొత్త చట్టాలపై ఆందోళన చేయడంతో.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ జరగాల్సి ఉందని స్పీకర్ చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఆయన తిరస్కరించారు. దీంతో స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో కాంగ్రెస్ తో పాటు విపక్షాల సభ్యులు.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సభను నినాదాలతో హోరెత్తించారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.
Also Read:స్టూడెంట్ వీసా ఫీజు భారీగా పెంచిన ఆస్ట్రేలియా
అయితే... సభా కార్యక్రమాలకు అడ్డుపడడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. అటు సభ ప్రారంభానికి ముందు సభ బయట విపక్షాలు ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ నిరసనకు దిగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.