టోక్యోలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన స్పీకర్‌‌‌‌

వికారాబాద్, వెలుగు : జపాన్‌‌‌‌ పర్యటనలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌కుమార్‌‌‌‌, మండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా ప్రకాశ్‌‌‌‌, లేజిస్లేచర్‌‌‌‌ సెక్రటరీ వి.నరసింహాచార్యులు సోమవారం టోక్యోలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి వెంట సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌‌‌‌ సైతం ఉన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్‌‌‌‌ పార్లమెంటరీ అసోసియేషన్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌లో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్లలో భాగంగా న్యూజిలాండ్‌‌‌‌ దేశంలో పర్యటించిన తెలంగాణ శాసన బృందం అక్కడి నుంచి జపాన్‌‌‌‌ చేరుకుంది.