స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. లేదంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొద్దిలో ప్రమాదానికి గురయ్యేవారు. పోచారం కాన్వాయ్ లోని ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కాన్వాయ్ లో వస్తున్నారు. ఈ సమయంలో కాన్వాయ్ లోని బాంబ్ డిస్పోజల్ బొలెరో వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడు. అయితే బొలెరో వాహనం డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..లారీని సీజ్ చేశారు.