ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బాన్సువాడ, వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. 16న బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సమీకరించి నాలుగు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో  ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 15,000 మందికి ప్రభుత్వం తరుపున భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పీకర్ కోరారు. సమావేశంలో ఆర్డీవో రాజాగౌడ్, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. 

జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పాలి:మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు: సమైక్యతా వజ్రోత్సవ ఉత్సవాల్లో  జాతీయ స్ఫూర్తిని చాటాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందూరు కొత్త కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీపీ కె.ఆర్ నాగరాజులతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ నెల 1 6 నుంచి ప్రారంభం కానున్న వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. అంనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం చాటి చెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు . దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా  తెలంగాణ1948 సెప్టెంబర్ 17న  ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు. ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్నట్లు చెప్పారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు, బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యం వక్తలు వివరిస్తారని చెప్పారు. 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు చెప్పారు. పంద్రాగస్టు తరహాలోనే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరపాలన్నారు. జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి హోదాలో తాను కలెక్టరేట్‌‌‌‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటానని చెప్పారు. అదే రోజున హైదరాబాద్‌‌‌‌లో జరిగే  కార్యక్రమంలో జిల్లా నుంచి సుమారు 3,500 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్ర్య సమర యోధులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.  సమావేశంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, నగర పాలక సంస్థ ఇన్‌‌‌‌చార్జి కమిషనర్ చిత్రామిశ్రా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌‌‌రావు,  డీఆర్డీవో చందర్, డీటీసీ వెంకటరమణ, డీపీవో జయసుధ, డీఐఈవో  రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అదనపు డీసీపీ గిరిరాజ్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రివ్యూలో విప్​గంప గోవర్ధన్, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ దఫేదర్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,  స్టేట్​ఉర్దూ ఆకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు చంద్రమోహన్, వెంకటేశ్ దొత్రే పాల్గొన్నారు.


తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం
 బీజేపీ నేత ధన్‌‌‌‌పాల్‌‌‌‌ సూర్యనారాయణ
 ఉమ్మడి జిల్లాలో బీజేపీ ర్యాలీలు

నిజామాబాద్/జుక్కల్‌‌‌‌/బాన్సువాడ/నందిపేట/బాల్కొండ, వెలుగు: టీఆర్ఎస్ పాలకులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని  8 ఏళ్లుగా ప్రజలను మోసగించిందని, ఇప్పుడు చరిత్రను వక్రీకరించేందుకు కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌పాల్‌‌‌‌ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందూరు, బాల్కొండలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.  ప్రజలకు తెలంగాణ విమోచన పై అవగాహనలో భాగం 5 రోజుల పాటు బీజేపీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల గోసకు చలించి సర్దార్​వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో సెప్టెంబర్​17న విముక్తి కల్పించారని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుందని, ప్రజలు తిరగబడి ప్రజాక్షేత్రంలో ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఏలేటి మల్లికార్జున్‌‌‌‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌‌‌‌కృష్ణ,  నాయకులు చిరంజీవి, సుధీర్, లక్ష్మీనారాయణ, లింగం, శ్రీధర్, వినోద్, సాయికుమార్, భగత్, ఆదిత్య, రోషణ్ లాల్, రాజు, వీరేందర్ పాల్గొన్నారు  పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌‌‌‌లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, నందిపేట బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నాగ సురేశ్‌‌‌‌, బాన్సువాడలో  బొగ్గు గనుల బోర్డు డైరెక్టర్‌‌‌‌ మురళీధరన్‌‌‌‌గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు.   కామారెడ్డిలో జరిగిన ర్యాలీలో బీజేవైఎం జిల్లా ఇన్‌‌‌‌చార్జి సుధీర్, బీజేపీ జిల్లా జనరల్​సెక్రటరీ తేలు శ్రీనివాస్, వైస్​ ప్రెసిడెంట్లు భరత్, సురేశ్‌‌‌‌, కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్​, రవి, నరేందర్, ప్రవీణ్‌‌‌‌ పాల్గొన్నారు.


స్త్రీ విముక్తితోనే సమాజ ప్రగతి 
మోర్తాడ్, వెలుగు: సమాజంలో స్త్రీ సమస్యల నుంచి విముక్తి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. బుధవారం రోజున కమ్మర్పల్లి ఏరియా పీవోడబ్ల్యూ మహాసభ మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామంలో నిర్వహించారు. ఈ సభకు  ఆమె ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా స్త్రీని రెండో శ్రేణి పౌరురాలిగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అంతరిక్షంలో నడపగలిగే శక్తియుక్తులు కలిగి ఉన్నా మహిళను మానసికంగా,  అభివృద్ధి కాకుండా పాలకుల విధానాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులు జి.కిషన్, బి.అశోక్, రాదక్క, వై.రాధా, నర్సక్క, వెంకమ్మ, ఎలిసా, పద్మ పాల్గొన్నారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును తరలించొద్దు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి సబ్​రిజిస్ట్రార్ ఆఫీసును జిల్లా కేంద్రంలోనే కొనసాగేలా చూడాలని కోరుతూ  బుధవారం  ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌‌‌‌కు రియల్​ఎస్టేట్, డాక్యుమెంట్‌‌  రైటర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. టౌన్‌‌‌‌లో అందరికీ అందుబాటులో ఉన్న  ప్రదేశం నుంచి ఆఫీసును పాత రాజంపేటలో ఏర్పాటు చేసేందుకు  ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారని  దానిని వెంటనే విరమించుకోలన్నారు.  రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ అతిమాముల రమేశ్​గుప్తా,  క్రెడా కామారెడ్డి ప్రెసిడెంట్ బద్దం రాజు,  ప్రతినిధులు కిరణ్‌‌‌‌రెడ్డి, దశరథ్,  దేవసేనా, శంకరప్ప, గంజి సతీశ్‌‌‌‌ పాల్గొన్నారు. 

ముమ్మాటికీ విద్రోహ దినమే
సిరికొండ, వెలుగు: సెప్టెంబర్ 17 ముమ్మాటికీ  తెలంగాణ విద్రోహ దినమేనని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సబ్​ డివిజన్ కార్యదర్శి వి.బాలయ్య అన్నారు. బుధవారం మండలంలోని గడ్కోల్‌‌‌‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిస్టులు నిజాం రాజుపై పోరాడుతుంటే.. అధికారం ఎక్కడ వారి చేతుల్లోకి పోతుందని భావించి ప్రధాని నెహ్రూ సైన్యాన్ని పంపి నిజాంను కాపాడారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు కారల్ మార్క్, గులాం హుస్సెన్, చిన్నారెడ్డి, కృష్ణ, నర్సాగౌడ్, శివరాజ్, రాములు పాల్గొన్నారు.

ఎన్సీఎస్ఎఫ్‌‌‌‌లో కాపర్, బేరింగ్‌‌‌‌లు చోరీ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ సహకార చక్కర కర్మాగారంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు లక్షల విలువ చేసే బేరింగ్‌‌‌‌లు, కాపర్ వైర్, ఇతర పనిముట్లు దొంగలించారు. ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీలో జరిగిన దొంగతనాలపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, సెక్రటరీ రాధాకృష్ణ గౌడ్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు కూడా వినతిపత్రం సమర్పించారు.  

పట్టణ సమస్యలపై బీజేపీ నిరసన
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో కుక్కలు, పందులు, కోతుల సంచారం పెరిపోయిందని, పరిష్కరించాల్సిన మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ బుధవారం ఆర్మూర్ మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌లో కమిషనర్ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌ ముందు కూర్చని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ టౌన్‌‌‌‌లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, కుక్కల దాడిలో ఇద్దరు స్కూల్ స్టూడెంట్లు గాయపడి ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. ఆయినా బల్దియా పాలకవర్గం స్పందించడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించడం చేతకాకుంటే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్,  కమిషనర్ రాజీనాయా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ జెస్సు అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, మాజీ మున్సిపల్​ఫ్లోర్ లీడర్ ద్యాగ ఉదయ్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి పాల్గొన్నారు.