![ఆస్పత్రి నుంచి స్పీకర్ పోచారం డిశ్చార్జ్](https://static.v6velugu.com/uploads/2021/11/Speaker-Pocharam-Srinivas-Reddy-discharged-from-hospital_3WuEy8HxmM.jpg)
కరోనా నుంచి కోలుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 24 ఆయన ఆసుపత్రిలో చేరారు. ముందస్తు జాగ్రత్తగా అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకోనున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పోచారంకు నెగెటివ్ వచ్చింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆయనను డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు.