సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన స్పీకర్

బాన్సువాడ,వెలుగు:  ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈ నెల 30న బాన్సువాడ లో జరిగే సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.   వీక్లీ మార్కెట్ స్థలాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.  

కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ,  పోచారం సురేందర్ రెడ్డి,  రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి,  ప్రజాప్రతినిధులు, నాయకులు  ఉన్నారు.