- స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (తెలంగాణ స్టేట్యూనియన్ ఆఫ్ వర్కింగ్జర్నలిస్ట్స్) జిల్లా 2వ మహాసభలు ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాభారతిలో జరిగాయి. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన స్పీకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇండ్ల స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిస్తారన్నారు. యూనియన్ స్టేట్జనరల్ సెక్రెటరీ విరాహత్అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజల పక్షాన నిలిచేందుకు యానియన్ కృషి చేస్తోందన్నారు. నేషనల్కౌన్సిల్మెంబర్ వేణుగోపాలచారి, స్టేట్కౌన్సిల్ప్రతినిధులు ఇంద్రాసేనారెడ్డి, జిల్లా ప్రతినిధులు లతీఫ్, రజినీకాంత్, వెంకటరమణ పాల్గొన్నారు.