ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు: ఫారెస్ట్ ‌‌ భూముల్లో 2005 కంటే ముందు నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు మాత్రమే పట్టాలు ఇస్తామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్ ‌‌రెడ్డి చెప్పారు. కొంత మంది ఫైరవీకారులు అమాయక రైతులను ప్రలోభ పెట్టి ఇప్పుడు కొత్తగా ఫారెస్ట్ ‌‌ భూములను నరికి సాగు చేసుకొవచ్చని మభ్య పెడుతున్నారని, అలాంటి వారికి పట్టాలు రావని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారంపై శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై బీర్కుర్​ మండలం తిమ్మాపూర్ ‌‌ ‌‌లోని ఫంక్షన్ హాల్ ‌‌లో ఉమ్మడి జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. బీర్కుర్ ‌‌ ‌‌లో ఫారెస్ట్ ‌‌, రెవిన్యూకు సంబంధించి ఉన్న సమస్యను పరిష్కరించి ముగ్గురు రైతులకు ఫాస్ ‌‌బుక్స్ ‌‌ అందించారు. అనంతరం స్పీకర్​ మాట్లాడుతూ కొత్తగా ఫారెస్ట్ ‌‌ భూముల్లో చెట్లు నరకడం, పోడు వ్యవసాయం చేయడం కుదరదన్నారు. భూముల విభజనపై కలెక్టర్​దే తుది నిర్ణయమన్నారు. సమావేశంలో కామారెడ్డి, నిజామాబాద్​జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్, నారాయణరెడ్డి, ఎస్పీ బి.శ్రీనివాస్​రెడ్డి, డీఎఫ్ ‌‌వోలు నిఖిత, వికాస్ మీనన్, ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు . 

ఉప రాష్ట్రపతిని కలిసిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు: ఉప రాష్ట్రపతి జగ్ ‌‌దీప్ ధన్ ‌‌కర్ ‌‌ ‌‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  

జీవన భృతి కోసం ధర్నా

కామారెడ్డి, వెలుగు: బీడీ ప్యాకర్లు, నెలసరి ఎంప్లాయీస్, బీడీ టెకెదార్లకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ ​చేస్తూ బీఎల్టీయూ ( బహుజన బీడీ కార్మిక సంఘం) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం స్టేట్ ప్రెసిడెంట్ సిద్ధిరాములు మాట్లాడుతూ బీడి ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులు అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారన్నారు. చేతినిండా పని దొరక్క చాలినంత జీతం రాక కుటుంబాన్ని పోషించడం కార్మికులకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్​ ఏవోకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్​ కమ్మరి సదానందం, ప్రతినిధులు సాయికృష్ణ, స్వామి, బాలకిషన్, జగదీశ్, నర్సింలు పాల్గొన్నారు. 

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు

సిరికొండ, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ లీడర్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ మాలవత్ సంగీత రాజేందర్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ ‌‌ జరిగింది. ముందుగా  వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సర్పంచ్ ‌‌లు రాజరెడ్డి, చిన్నారెడ్డి, నర్సారెడ్డి, ఎంపీటీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ట్రాన్స్ ‌‌కో ఆఫీసర్లు గ్రామాల్లో కొత్త స్తంభాలు వేయడంలేదని ఆరోపిచారు. ఇందుకు స్పందించిన బాజిరెడ్డి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సిరికొండ నుంచి చిమన్ ‌‌పల్లి, పెద్దవాల్గోట్ నుంచి రావుట్ల వరకు డబుల్ రోడ్డు, మండలంలోని తండాల్లో రోడ్ల నిర్మాణం కోసం, గడ్కోల్, వాడి వాగు వద్ద బ్రిడ్జి  మంజూరు కోసం ప్రతిపాధనలు పంపించామని చెప్పారు. అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జట్పీటీసీ మాన్​సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, తహసీల్దార్ గఫర్ మీయా, సొసైటీ చైర్మన్లు గంగారెడ్డి, రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

బంజార భవన్ ‌‌కు నిధులివ్వండి

ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి బంజార సంఘం భవనానికి రూ.10 లక్షల నిధులు ఇప్పించాలని బంజార నాయకులు కోరారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ‌‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల బంజార అధ్యక్షుడు లాల్​సింగ్ నాయక్, ఎస్టీసెల్ అధ్యక్షుడు శంకర్ ‌‌ ‌‌నాయక్ ‌‌,  పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.  

ఓటు బ్యాంక్​ రాజకీయాలు రాష్ట్రానికే ముప్పు

నిజామాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ‌‌ ‌‌ ఓటు బ్యాంకు రాజకీయాలతో ద్రోహులకు రక్షణ కల్పిస్తూ.. రాష్ట్రానికి పెనుముప్పును తెచ్చి పెడుతున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. శుక్రవారం పార్టీ జిల్లా ఆఫీస్ ‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ‌‌లో ఎన్ఐఏ చేసిన దాడుల్లో ఉగ్రవాద మూలాలు బయట పడ్డాయన్నారు. పీఎఫ్ ‌‌ఐ సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక షెల్టర్ ‌‌ ‌‌గా వాడుకుంటుందని ఆరోపించారు. ఈ సంస్థలపై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిఘా పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు ఎంఐఎం సపోర్ట్ కోసం వీటికి సహకరిస్తుందేమో అని ప్రజలకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ ‌‌లోని ఓ ప్రాంతం మినీ పాకిస్తాన్ లాగా తయారైందని ఆరోపించారు. పీఎఫ్ఐ లాంటి సంస్థలను కూకటివేళ్లతో పెకిలించేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఉపాధ్యక్షులు కేపీ రెడ్డి, శివ ప్రసాద్, పంచారెడ్డి ప్రవళిక, భారత్ భూషణ్, బద్దం కిషన్, దొంతుల రవి, శిల శ్రీనివాస్,  జశ్వంత్ ‌‌రావు, పంచారెడ్డి శ్రీధర్, గిరి బాబు, చిరంజీవి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి ప్రజల రుణం తీర్చుకోలేనిది

తాడ్వాయి, వెలుగు: గత ఎన్నికల్లో తనకు విరాళాలులిచ్చి మరీ గెలిపించిన ఎల్లారెడ్డి ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కృష్ణజీవాడి గ్రామంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని చెప్పారు. అది చూసి ఓర్వలేకే బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగం భూషణం, ఎంపీపీ కౌడి రవి, జడ్పీటీసీ రమాదేవి, సీడీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్మ రవీందర్ ‌‌ ‌‌రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు రామ్ ‌‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులగం సాయిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కపిల్ ‌‌రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింలు పాల్గొన్నారు  

మొక్కుబడిగా సోషల్ ఆడిట్ ‌‌

కోటగిరి, వెలుగు: మండలంలోని 28 జీపీల్లో జరిగిన ఉపాధి పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ శుక్రవారం ముగిసింది. ఈ ఆడిట్ ‌‌కు సంబంధించిన ప్రజావేదిక  మండల కేంద్రంలో రెండు రోజులు కొనసాగింది. ఆయా గ్రామాల్లో లక్షల్లో అవకతవకలు జరిగినట్టు డీఆర్ ‌‌ ‌‌పీలు తెలుపగా అధికారులు మాత్రం మొక్కుబడిగా ఫైన్ ‌‌లు వేసి చేతులు దులుపుకున్నారు. మండలంలోని మేజర్ జీపీల్లో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినప్పటికీ చిన్న జీపీలకే అత్యధిక రికవరీ, ఫైన్ వేశారు. ప్రజావేదికలో సైతం అధికారులు, ఆడిట్ సిబ్బందికి మధ్య రోజూ వాదనలు జరగడం, అధికారులు చూసీ చూడనట్టు ఫైన్ ‌‌లు వేయడం అనుమానాలకు తావిస్తోంది. కోటగిరి మండలంలో మూడేండ్లకు ఫైన్ ‌‌లు రికవరీలు కలిపి రూ.1,61,382గా రాశారు. చేతన్ నగర్ ‌‌ ‌‌లో అత్యధికంగా రూ.44 వేలు, పొతంగల్ ‌‌లో రూ.25 వేలు రికవరీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో చందర్ నాయక్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఎస్ ‌‌ఆర్ ‌‌ ‌‌పీ తిరుపతి, ఇన్ ‌‌చార్జి ఎంపీడీవో మారుతి, ఏపీవో రమణ పాల్గొన్నారు.