- ఎన్టీఆర్‌ను చూసే రాజకీయాల్లోకి వచ్చా
- స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ని, వెలుగు : కమ్మవారితో తనకు ముప్పై ఏండ్లుగా ఆత్మీయబంధం ఉందని, ఎన్టీఆర్చొరవతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వర్నిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా కమ్మ కులస్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌మాట్లాడుతూ.. కమ్మ సామాజికవర్గం వారిని ఎప్పుడూ తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న తనను ప్రోత్సహించి రాజకీయాల వైపు నడిపించిన తన రాజకీయ గురువు శ్రీనివాస్‌రావు ఈ కులానికి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగిందన్నారు. బాన్సువాడ లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదని పోచారం ఎద్దేవా చేశారు. మూడో సారి కేసీఆర్ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్పీకర్సతీమణి పుష్ప, కుమారులు సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ని మండలం నెహ్రూ నగర్ కు చెందిన అప్పసాని శ్రీనివాస రావు పోచారం నామినేషన్‌కోసం రూ.25,000 నగదు సహాయం అందించారు.