కామారెడ్డి టౌన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మించనున్న బంజరా భవన్‌కు ఆదివారం స్పీకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారా భవన్ బిల్డింగ్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించామని, ఫండ్స్కోసం త్వరలోనే సీఎంను కలువనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఎస్టీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందని, పోడు భూములపై వారికి హక్కులు కల్పించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 11,365 ఎకరాలకు గాను 5,013 మందికి ఆర్వోఎఫ్ఆర్పట్టాలు ఇచ్చామన్నారు. ప్రోగ్రామ్‌లో విప్గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్టేట్ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దీన్, రైతుబంధు జిల్లా ప్రెసిడెంట్అంజిరెడ్డి, బంజరా ప్రతినిధులు బద్యానాయక్, రాంసింగ్ పాల్గొన్నారు.